కందుకూరు: సోలార్ సిస్టమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

385చూసినవారు
కందుకూరు: సోలార్ సిస్టమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే
కందుకూరులోని శ్రీ కోటేశ్వర థియేటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుదర్శి సోలార్ సిస్టమ్స్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. వ్యాపార యజమాని, టిడిపి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుదర్శి శ్యామ్ ప్రసాద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో సోలార్ వినియోగం పెరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ప్రోత్సహిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్