కందుకూరు: నాట్య కళాకారులకు ఎమ్మెల్యే ప్రశంసలు

189చూసినవారు
కందుకూరు: నాట్య కళాకారులకు ఎమ్మెల్యే ప్రశంసలు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించిన కందుకూరుకు చెందిన నాట్య కళాకారులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఘనంగా సత్కరించారు. గత ఏడాది డిసెంబర్ 27న హైదరాబాదులో భారతి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి కళావైభవం–2 కార్యక్రమంలో శ్రీ నటరాజ నాట్యమండలి, సరస్వతి నిలయానికి చెందిన 16 మంది చిన్నారులు అద్భుత ప్రదర్శనతో ఈ రికార్డును సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్