కందుకూరు పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు కొత్తూరి వెంకట సుధాకర్ అనారోగ్యంతో ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. కొత్తూరి వెంకట సుధాకర్ కు త్వరగా ఆరోగ్యం మెరుగుపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నాయకుడు మురారిశెట్టి సుధీర్ కూడా పాల్గొన్నారు.