కందుకూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి, ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కందుకూరు అర్బన్ పరిధిలో 4,067 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు,
టీడీపీ నాయకులు పాల్గొన్నారు.