ఓగూరు స్వర్ణ గ్రామ సచివాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం

691చూసినవారు
ఓగూరు స్వర్ణ గ్రామ సచివాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం
కందుకూరు మండలం ఓగూరు స్వర్ణ గ్రామ సచివాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వెలుగుచూసింది. మహిళా పోలీస్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ నెల 24న ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సచివాలయానికి తాళాలు వేసి విధులకు గైర్హాజరయ్యారు. ఈ ఘటనపై ఎంపీడీవో రత్నజ్యోతి స్పందిస్తూ, ఇద్దరికీ మెమోలు జారీ చేసినట్లు శనివారం వెల్లడించారు. ప్రభుత్వ సేవల్లో ఇలాంటి నిర్లక్ష్యం సహించబోమని, విధులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్