
కందుకూరు: మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆగ్రహం
గురువారం కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. కందుకూరు అభివృద్ధి, అవినీతిపై దమ్ముంటే ముఖాముఖి చర్చకు రావాలని వైసీపీ ఇంచార్జి బుర్రా మధుసూదన్‌కు సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. వైసీపీ నేతల అవినీతి కొండంతగా ఉందని, 2029లో మళ్లీ గెలిచేది తామేనని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.







































