కావలి రూరల్ మండల పరిధిలోని వెంకయ్యగారిపాలెం సమీప జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కోరికల అంకయ్య (53) మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్తున్న ట్యాంకర్, డ్రైవర్ కునుకు తీయడంతో అదుపుతప్పి కల్వర్టులో పడిపోయింది. ఈ ఘటనలో అంకయ్య అక్కడికక్కడే మరణించాడు.