అల్లూరు: మహిళ మెడలో సరుడు చోరీ

1584చూసినవారు
అల్లూరు: మహిళ మెడలో సరుడు చోరీ
ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అల్లూరు రాజులవారి వీధిలో నివసిస్తున్న పుత్తేటి రమాదేవి మెడలోని మూడు సవర్ల బంగారు సరుడును మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి బలవంతంగా లాక్కొని పొలాల్లోకి పరారయ్యాడు. బహిర్భూమికి వెళ్లిన మహిళ నుంచి జరిగిన ఈ చోరీపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాసుల రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్