శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కావలిలో
బీజేపీ నేత డా. మహేంద్ర యాదవ్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విలేజ్ క్లినిక్స్‌లో యాంటీ స్నేక్ వెనమ్ (ASV) ఇంజెక్షన్లు, ECG యంత్రాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్నిఆదివారం కోరారు. పాము కాట్లు, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్యం అందించడానికి, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించి, మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తాయని తెలిపారు.