అల్లూరులో సోమవారం పంట కాలువలో సుబ్బయ్య అనే వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.