చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమంలో భాగంగా, కావలిలో
వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ జరిగింది.
వైసీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో సుమారు 500 బైకులు, 2,000 మంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.