లేసుల ప్యాకెట్లతో వినాయకుడి వినూత్న ఊరేగింపు

3888చూసినవారు
నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని అల్లూరులో పేరంటాలమ్మ తోపు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ప్రతిష్ఠించిన వినాయకుడి చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు వినాయకుడి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆదివారం ఊరేగించారు. లేసుల ప్యాకెట్లతో వినూత్నంగా అలంకరించి నిర్వహించిన ఈ ఊరేగింపు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లేసుల ప్యాకెట్లతో చేపట్టిన వినూత్న ఊరేగింపును చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లూరులో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్