కావలి: మహిళల అవమానంపై పత్రికాధినేతపై ఫిర్యాదు

333చూసినవారు
మహిళలపై అసభ్యకర వార్తలు, వ్యాఖ్యలు ప్రచారం చేయడం తీవ్రంగా ఖండనీయమని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. కావలిలో మహిళా నాయకులతో కలిసి ఓ పత్రికాధినేతపై ఒకటో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల పేరుతో మహిళలను అవమానించడం అనాగరికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్