కావలిలోని వెంగళరావు నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగింపు, సబ్‌స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుంది. వెంగళరావు నగర్, ఇందిరా నగర్, బాలకృష్ణారెడ్డి నగర్, తుఫాన్ నగర్, జనతా పేట వంటి ప్రాంతాలు ప్రభావితమవుతాయి. ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.