కావలి: ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించొద్దు

361చూసినవారు
కావలి ఆర్డిఓ కార్యాలయం వద్ద సిపిఐ కావలి కార్యదర్శి పెంచలయ్య ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని, పని దినాలను మార్చవద్దని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డిఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చాలని, పని దినాలను తగ్గించాలని చూస్తోందని ఆరోపించారు. ఈ పథకంతో ఎంతోమంది పేద ప్రజలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్