కావలి: ఎల్ వో సి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

859చూసినవారు
కావలి: ఎల్ వో సి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రెండు ఎల్‌వోసి పత్రాలను బాధితులకు అందజేశారు. అన్నగారిపాలెం గ్రామానికి చెందిన రుక్మిణమ్మకు రూ. 1,74,809, తుమ్మలపెంటకు చెందిన శ్రీనుకు రూ. 60,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్