నెల్లూరు జిల్లా వింజమూరులో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కావలి ఎమ్మెల్యే వెంకట క్రిష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డిని ఎలా ఉన్నారని ఆప్యాయంగా పలకరించారు. కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.