కావలిలోని ఉదయగిరి బ్రిడ్జి కింద ఓ వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆదివారం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కలిచేటి మాధవ (52) మృతి చెందగా, ఘటనపై రైల్వే ఎస్సై వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.