నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలో మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పోలేరమ్మ ఆలయం, తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలను శనివారం ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆయన చేస్తున్న ఈ సామాజిక సేవలు స్థానికుల మన్ననలు పొందుతున్నాయి. గతంలోనూ పేద విద్యార్థులకు సహాయం, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు.