రెహమాన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి, ఎమ్మెల్యే

2371చూసినవారు
కావలి పట్టణానికి చెందిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ జానీ తండ్రి రెహమాన్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెహమాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్