ప్రజల గడప వద్దకే ఎమ్మెల్యే.. సమస్యల స్వీకరణ

480చూసినవారు
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న "ఇంటింటికి ఎమ్మెల్యే" కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం 15వ వార్డు వడ్డెపాలెం మెయిన్ రోడ్‌లో పర్యటించారు. "సమస్య మీది – పరిష్కారం నాది" కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్