దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే కావ్య

450చూసినవారు
కావలి పట్టణంలోని హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ బాబా దర్గాలో జరుగుతున్న గంధ మహోత్సవంలో ఎమ్మెల్యే దగుమాటి కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేసి, నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ప్రాంత అభివృద్ధి కోసం దేవుడిని వేడుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత సామరస్యం, సామాజిక ఐక్యతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని ఆమె పేర్కొన్నారు.