నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతారహితంగా మాట్లాడటం ఖండనీయమని, వైసీపీ నేతలు ఆయన వ్యాఖ్యలను సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు హద్దులు ఉండాలని, ప్రజలు ఇలాంటి భాషను అంగీకరించరని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.