కావలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా సత్రంపాడుకు చెందిన ఇల్లపు శివ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమల దర్శనానికి వెళ్లి బుధవారం తిరిగి వస్తుండగా, వారి కారు అదుపుతప్పి వేగంగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది, కుటుంబం మొత్తం దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.