కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన నువ్వూరు అరుణమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్పందించి, ఎల్‌వోసీ ద్వారా రూ. 2,24,100 ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో సహాయ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో బాధిత కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.