నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో శ్రీ వెంగమాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, విద్యుత్ దీపాలతో ఆలయం కళకళలాడుతోంది. భక్తుల నామస్మరణతో నర్రవాడ ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. భక్తులు అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు మొక్కులు సమర్పిస్తున్నారు.