ఆదివారం రాత్రి దగదర్తి మండలంలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద పుత్తేడు గ్రామానికి చెందిన కుందుర్తి వెంకటేష్ (25), వెంగారెడ్డి పాలెం గ్రామానికి చెందిన కొప్పాల బాల వెంకయ్య (26)లను గండవరం నుంచి పెద్ద పుత్తేడు వైపు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి రాడ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.