
ఈనెల 12న మంత్రి లోకేష్ రాక
మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన విశాఖ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు చేరుకుంటారు. మాజీ ఎమ్మెల్సీ వి. బాలసుబ్రహ్మణ్యం నివాసాన్ని సందర్శించిన అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరి బోగోలు మండలం జవ్వలాదిన్నెలో సాగర్ డిఫెన్స్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.



































