
కావలి: సంక్షేమ హాస్టల్స్ లో వసతులు కల్పించాలని RDOకు వినతి
నెల్లూరు జిల్లాలో 150 ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం 65 మాత్రమే మిగిలాయని, వాటిలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మళ్లీ తెలిపారు. ఈ నేపథ్యంలో, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం ఆర్డిఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.








































