
ఆల్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన కావలి యువకుడు
కావలి మండలం గౌరవరం గ్రామానికి చెందిన సూరే రేవంత్ కృష్ణారెడ్డి UPSC (ESE) 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా 72వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. అంతేకాకుండా, గేట్-2025 లో కూడా ఆల్ ఇండియా 16వ ర్యాంకు సాధించడం విశేషం. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని పలువురు యువకుడిని ప్రశంసించారు.







































