జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: ప్రశాంతి రెడ్డి

324చూసినవారు
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: ప్రశాంతి రెడ్డి
కోవూరు నియోజకవర్గంలో యూరియా కొరత అనేది కేవలం అపోహ మాత్రమేనని, రైతులు ఆందోళన చెందవద్దని కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరులోని తమ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతిపక్షాలు పనిలేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయని, రైతులు అర్ధం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత సీజన్ లో కోవూరు నియోజకవర్గంలో మొత్తం 55 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని, జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయని, అన్నదాతలు యూరియా పై అపోహలు వీడాలని ఆమె భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్