బుచ్చి మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టుబడి పాలెంకు చెందిన బుజ్జమ్మ (75) రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై సంతోష్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం బుచ్చి మండలంలో విషాదాన్ని నింపింది.