శుక్రవారం రాత్రి బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు సమీపంలో ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగం అదుపుతప్పిన ఓ యువకుడు బైక్‌తో డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, యువకుడిని ఆసుపత్రికి తరలించారు.