బుచ్చిరెడ్డిపాళెం మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్దుల్లా(23) అనే యువకుడు మృతి చెందాడు. పొగమంచు కారణంగా బైక్‌పై వెళ్తుండగా, బుచ్చి పురంధరపురం సమీపంలో రోడ్డు పనుల వద్ద మట్టికట్టలకు తగిలి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఎస్సై సంతోష్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.