బుధవారం వింజమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తున్న ఆరుగురితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన “ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం” సోషల్ మీడియా పేజ్ నిర్వహిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌తో సీఎం మాట్లాడారు. ప్రజలకు అందిస్తున్న సమాచారంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.