ఇందుకూరుపేట మండలం గంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. నెల్లూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతిరోజూ విశేష అలంకరణలతో అమ్మవారిని ఊరేగిస్తూ గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. డప్పుల మోతలు, బాణసంచా వెలుగులు, ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.