రొట్టెల పండుగ–2026 భద్రతకు హైటెక్ డ్రోన్ నిఘా

889చూసినవారు
రొట్టెల పండుగ–2026 భద్రతకు హైటెక్ డ్రోన్ నిఘా
బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ–2026 సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ మరియు జనసమ్మర్థాన్ని పర్యవేక్షించేందుకు పోలీస్ శాఖకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 4 నైట్ విజన్ డ్రోన్ కెమెరాలను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం అందజేశారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఈ డ్రోన్లను స్వీకరించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్