రొట్టెల పండుగలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

4చూసినవారు
రొట్టెల పండుగలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
నెల్లూరు బారాషహీద్‌ దర్గాల ఐదు రోజుల రొట్టెల పండుగ మంగళవారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో ఉన్న బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ ఎంతో పవిత్రమైన పండుగని కొనియాడారు. ఈ పండుగకు దేశ, విదేశాల నుంచి, అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్పారు. భక్తులు తమ కోరికలు నెరవేరితే, లేదా ఏవైనా కోరికలు ఉంటే ఇక్కడ రొట్టెలు వదలడం, పట్టుకోవడం చేస్తుంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్