నెల్లూరు జిల్లా రాజుపాలెం వద్ద కలకత్తా-చెన్నై జాతీయ రహదారిపై బ్రిడ్జిపై లారీ బోల్తా పడింది. నెల్లూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ కింద పడివుంటే పెద్ద ప్రమాదం తప్పేదని స్థానికులు తెలిపారు. లారీలోని బస్తాలు రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్లియరెన్స్ పనులు చేపట్టారు.