ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో 'తాలిం ఏ హునర్' ద్వారా 250 మంది పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తున్నారు. ట్యాలెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన
విద్యార్థులు, తమలాగే మరికొంతమందికి ఉచిత విద్య అందాలని కోరుకుంటూ ఆదివారం రొట్టె వదిలారు. ఈ రొట్టెను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వీకరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రొట్టెల పండగకు 20 లక్షల మంది భక్తులు అధికంగా విచ్చేశారని ఆయన తెలిపారు.