కోవూరు మండలం నేషనల్ హైవేపై ఆర్కే పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు, హైవే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.