కొడవలూరు మండలం గండవరం పొలాల సమీపంలో జరిగిన జంట హత్యల ఘటనపై జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, అడిషనల్ ఎస్పీ సౌజన్యతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. రూరల్ డీఎస్పీతో పాటు పోలీసు సిబ్బందిని హత్యల తీరుపై ఆరా తీసిన ఎస్పీ, నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని ఆదేశించారు.