కోవూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

139చూసినవారు
కోవూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోవూరు మండలం పెద్ద పడుగుపాడు చంద్రమౌళి నగర్‌లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేత చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తెలుగుజాతికి గుర్తింపు తెచ్చి, జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో పార్టీ ఆశయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్