ప్రతి చోటా పోటీ చేస్తాం: నల్లపురెడ్డి ప్రసన్న

270చూసినవారు
ప్రతి చోటా పోటీ చేస్తాం: నల్లపురెడ్డి ప్రసన్న
శుక్రవారం రుక్మిణి కళ్యాణ మండపంలో వైసీపీ మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వెన్ను పోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా కోవూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం చైతన్యవంతమైన నియోజకవర్గమని, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోట వైసిపి పోటీ చేస్తుందని అన్నారు. ఇటీవల టిడిపి వాళ్లను చూసి వైసిపి వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్