
నెల్లూరు జిల్లా నూతన గణేష్ ఉత్సవ సమితి కమిటీ ప్రకటన
గణేష్ ఉత్సవ సమితి నెల్లూరు జిల్లా నూతన కమిటీని ఆంధ్ర ప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, ఉపాధ్యక్షులు భయ్యా వాసు స్థానిక వారాహి కన్వెన్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో ప్రకటించారు. అధ్యక్షులుగా వాయుగుండ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వేలూరు మహేష్, మధుసూదన్ రెడ్డి, రాఘవ రంగదాం, వడియాల శ్రీహరి, జెట్టి గోపిరెడ్డి, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కార్యదర్శిగా గడ్డం విజయకుమార్, అమర్నాథ్ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శిగా అమరావతి కృష్ణారెడ్డి, కోశాధికారి ఏవిఆర్ మోహన్ రావు, ఇమెడిశెట్టి సురేష్ తో పాటు పలువురు సభ్యులను ప్రకటించారు.







































