తాగునీటి ఎద్దడి నివారించేందుకు 103 కోట్ల నిధులు

215చూసినవారు
తాగునీటి ఎద్దడి నివారించేందుకు 103 కోట్ల నిధులు
జిల్లాలో తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం 197 తాగునీటి పనులకు రూ. 103.38 కోట్ల నిధులను మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డెవలప్‌మెంటు పథకంలో భాగంగా జల్‌జీవన్ పథకం అనుసంధానంతో ఈ నిధులను కేటాయించారు. తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో పథకాల మరమ్మతులు, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల మరమ్మతులు, కొత్త ట్యాంకుల నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్