రొట్టెల పండుగ సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. ఉచిత వైద్య పరీక్షలతో పాటు అవసరమైన మందులు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం కోసం అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎస్. రవీంద్ర రెడ్డి భక్తులు ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.