ఓ సామాన్యుడు ఫోన్ కాల్.. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

686చూసినవారు
ఓ సామాన్యుడు ఫోన్ కాల్.. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరులో రొట్టెల పండగకు వచ్చిన నంద్యాల భక్తుడు అహ్మద్ ఆసిఫ్, మధ్యాహ్నం మూడు గంటల నుంచి బస్సులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు. తనలాగే అనేకమంది ప్రయాణికులు పడుతున్న కష్టాలను వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆ భక్తుడి వివరాలు తెలుసుకుని, ప్రత్యేకంగా నంద్యాలకు రాత్రి పది గంటలకు బస్సును ఏర్పాటు చేయించారు. ఒక సామాన్యుడి విజ్ఞప్తికి ఎమ్మెల్యే చూపిన చొరవ ప్రశంసనీయం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్