పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరపాలక సంస్థ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, స్థానిక 45/1 సచివాలయం పరిధిలోని జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని పోలియో సెంటర్ లో చిన్నారులకు చుక్కల మందు వేశారు. 0 - 5 సంవత్సరాల లోపు చిన్నారులు అందరూ పోలియో చుక్కల మందు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు.