ఏప్రిల్ 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వింజమూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటనకు సంబంధించి వింజమూరు గెస్ట్ హౌస్ నిర్వహణ, ప్రోటోకాల్ బాధ్యతలను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్‌కు కలెక్టర్ అప్పగించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయబడతాయి.